జాపాల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు
*జాపాల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు* *మంచాల మండలం ఫోరం సర్పంచ్ అధ్యక్షుడు* . *మంచాల రవి* మంచాల మండలం సెప్టెంబర్ 28 (ప్రజావాణి)జాపాల: గ్రామంలోని ఎస్సీ కాలనీలో అండర్‌డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ మంచాల రవి ప్రారంభించారు. విడతల వారీగా గ్రామాభివృద్ధి పనులను చేపడుతూ ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అండర్‌డ్రైనేజీ పనులు పూర్తయితే మురుగునీటి సమస్య తగ్గడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని...