📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaజాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఈ నెల 26న “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976-2026)” ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇతర అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇప్పటికే 54 గ్రంథాలను రచించారని అన్నారు. పద్య కవిగా, గేయ కావ్య కర్తగా, విమర్శకునిగా ప్రఖ్యాతి గాంచిన భూమయ్య సాహిత్య పరిచయం నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో ఈ సదస్సుకు రూకల్పన చేశామని తెలిపారు. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, భాషావేత్తలు, విమర్శకులు పాల్గొని వివిధ అంశాల మీద పత్ర సమర్పణ చేస్తారని అన్నారు. పరిశోధకులు, స్థానిక సాహితీ వేత్తలు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవి కుమార్, డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్, పరీక్షల నియంత్రాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, అధ్యాపకులు డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు, ఎస్. ప్రభాకర్, దండి అంజయ్య, లింగస్వామి, వనజ, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.