ఓటర్ జాబితాలో తప్పులను తప్పక సవరించుకోవాలి
బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్
బెజ్జంకి, సెప్టెంబర్ 12 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామం లోని గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం ఓటర్ జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఓటర్ జాబితాలో తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే సవరించుకోవాలని సూచించారు.18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆయేషా, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సర్పంచ్ కవిత రత్నాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ హరీష్, బీఎల్‌ఓలు వెంకటలక్ష్మి, వేణు, పాలకవర్గ సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి, లింగాల అర్జున్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

