జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఈ నెల 26న “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976-2026)” ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇతర అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇప్పటికే 54 గ్రంథాలను రచించారని అన్నారు. పద్య కవిగా, గేయ కావ్య...