చెట్ల తొలగింపు పనులు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
చింతగట్టు సబ్‌స్టేషన్ పరిధిలో హసన్‌పర్తి, పెంబర్తి బావులకు నేడు కరెంట్ నిలిపివేత
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
వినియోగదారులు సహకరించాలి: ఏఈ శిరీష్ కుమార్
హసన్‌పర్తి, మన ప్రజవాణి :
చింతగట్టు సబ్‌స్టేషన్ పరిధిలోని హసన్‌పర్తి, పెంబర్తి బావుల విద్యుత్ లైన్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించే పనులు నేడు చేపట్టనున్నట్లు ఏఈ శిరీష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
చెట్ల తొలగింపు పనుల నేపథ్యంలో నేడు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, పనులు సురక్షితంగా పూర్తయ్యేలా విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఏఈ శిరీష్ కుమార్ కోరారు.

