📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaకోదాడ లో యువత కు జాబ్ మేళా నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన - మంత్రులు

కోదాడ లో యువత కు జాబ్ మేళా నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన – మంత్రులు

📰 Generate e-Paper Clip

కోదాడ లో యువత కు జాబ్ మేళా నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన – మంత్రులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మెగా జాబ్ మేళాకు 53 వేల మందికి పైగా యువత నమోదు చేసుకోగా, 350 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ — ఐటీ, ఫార్మా, తయారీ, వైద్య, బ్యాంకింగ్, రిటైల్ తదితర రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.