మన అంగన్వాడి మన బాధ్యత.
హుజూర్ నగర్ సీడీపీఓ పార్వతి.

హుజూర్ నగర్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి)
మన అంగన్వాడి మన బాధ్యత అని హుజూర్ నగర్ సీడీపీఓ అడావత్ పార్వతి, ఐసీడీసీ సూపర్వైజర్ నట్టే రమాదేవి అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి సెక్టర్ పరిధిలో లింగగిరి రైతువేదిక నందు 9వ జాతీయ పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో సమాజ పోషణ ఆరోగ్యం, బాల్య దశలో విద్యా వికాసానికి ప్రధాన కేంద్రాలుగా ఉపయోగపడ తాయన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు కిశోర బాలికల్లో పోషకాహర లోపం తగ్గించడానికి ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు అంగన్వాడి కేంద్రాలకు చెందిన 16 మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంతం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏవో స్వర్ణ, లింగగిరి పిహెచ్సి డాక్టర్ వేణుగోపాల్, పోషన్ అభియన్ బీసీ రాజేష్, విజయ్ కుమార్, సాయి త్రిలోక్, పంచాయతీ కార్యదర్శి సోనేర్, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, తదితరులు, పాల్గొన్నారు.

