📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonచాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

📰 Generate e-Paper Clip

*చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం*

*ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి):
చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చాకలి ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. భూమి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆమె జీవితం మార్గదర్శకమని తెలిపారు.

అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షులు వేముల బాలరాజు, కుమ్మరి సంఘం అధ్యక్షులు ఎద్నూరి బుచ్చయ్య, అభినాష్, ఇతర కుల సంఘ సభ్యులు, జిల్లా అధికారులు, ఐడిఒసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.