📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగోవర్ధనగిరిలో రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి భూమి కేటాయించండి

గోవర్ధనగిరిలో రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి భూమి కేటాయించండి

📰 Generate e-Paper Clip

*గోవర్ధనగిరిలో రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి భూమి కేటాయించండి – మంత్రికి వినతి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ మధ్య తెలంగాణ సలహా మండలి సభ్యుడు మంతపురి యాదగిరి శనివారం వినతి పత్రం అందజేశారు.

జనగామ జిల్లాలో తెలంగాణ రైతు కృషి విజ్ఞాన కేంద్రం (TRVK) కొరకు రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. అట్టి భూమి కేటాయింపునకు సంబంధించి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆగస్టు 20న సీసీఎల్ఏకు లేఖ రాశారని, ఆ 30 ఎకరాల ప్రభుత్వ భూమిని వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగించి, చదును చేయుటకు నిధులు కేటాయించి కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

మధ్య మండలి పరిధిలోని వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలలో ప్రతి జిల్లాలో TRVK ఏర్పాటు నిమిత్తం మెదక్, హనుమకొండ, జనగామ, ములుగు, భూపాలపల్లి ఈ ఐదు జిల్లాలలో సుమారు 30 నుండి 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జనగామ జిల్లాలో TRVK ప్రారంభించుట కొరకు గోవర్ధనగిరి గ్రామంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్సిటీ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు గుర్తించి, ఆ భూమి కేటాయింపు కొరకు సీసీఎల్ఏకు లేఖలు రాయడం జరిగిందన్నారు.

అక్టోబర్ మొదటి వారంలో భీమదేవరపల్లి గ్రామంలో 35 ఎకరాల భూమిని కేటాయించి కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని, తదుపరి జనగామ జిల్లాలో కూడా ప్రారంభించాలని కోరారు. అలాగే మిగిలిన మెదక్, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో కూడా ప్రభుత్వ భూమిని ఇప్పించి, ఆ జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేయనున్న TRVKలను మంజూరు చేయించి వాటికి నిధులు కేటాయించి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

జనగామ జిల్లాలోని రైతులకు మంచి, మేలైన విత్తనాలు, పైరులకు అవసరమైన సూచనలు అందించుటకు యూనివర్సిటీ యంత్రాంగానికి నిధులు విడుదల చేయుటకు ఎమ్మెల్యే, ఎంపీ మరియు కలెక్టర్ సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించాలని కోరారు.

నారాయణరావుపేట, పెద్దపల్లి జిల్లాలలో ఆ జిల్లా కలెక్టర్ల నిధుల నుంచి సుమారు 30 లక్షల చొప్పున రెండు జిల్లాలకు 60 లక్షల రూపాయలు కేటాయించిన ఆ జిల్లా కలెక్టర్లకు మధ్య మండలి రైతుల ప్రతినిధిగా, రైతుల తరపున కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.