EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriగురువుల సేవలకు లయన్స్‌ క్లబ్‌ ఘన సన్మానం....లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు...

గురువుల సేవలకు లయన్స్‌ క్లబ్‌ ఘన సన్మానం….లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్‌: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్‌ మండల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఎంఎంసీ ఘట్కేసర్‌ 6వ డివిజన్‌ కొండాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యతో పాటు విజ్ఞానం, వివేకం, క్రమశిక్షణ, విలువలు, మానవత్వాన్ని నేర్పించే గురువుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయడమే గురువులకు అందించే అసలైన గురుదక్షిణ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.దాస్‌, ఉపాధ్యాయులు శివకుమార్‌, లక్ష్మి, కల్పన, విజయలక్ష్మితో పాటు లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షుడు బచ్చు ప్రమోద్‌ గుప్తా, కార్యదర్శి నగేష్‌ గుప్తా, లయన్‌ రామ్మోహన్‌ అడ్వకేట్‌, లయన్‌ గోరకొంట రవీందర్‌, లయన్‌ సారా మురళి, లయన్‌ అల్లు కమలాకర్‌, లయన్‌ నర్సింగ్‌ రవిశంకర్‌, లయన్‌ మమత శర్మ, లయన్‌ లక్ష్మి, లయన్‌ హిమబిందు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.