📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaశ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన:- ప్రముఖ రియల్ ఎస్టేట్ హ్యాపారి భీమరాజు...

శ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన:- ప్రముఖ రియల్ ఎస్టేట్ హ్యాపారి భీమరాజు నర్సింగ్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

కొండాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అయిన శ్రీ ముత్యాలమ్మ ఆలయ నూతన నిర్మాణ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రముఖ సామాజిక సేవకుడు భీమరాజు నర్సింగ్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భీమరాజు నర్సింగ్ మాట్లాడుతూ, ఎస్సీ కాలనీ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని తన సొంత డబ్బులతో పూర్తిస్థాయిలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం ఖర్చును తానే భరించి, అందమైన ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు,దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో కొండాపురం గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.