గురువుల సేవలకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం….లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
ఘట్కేసర్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంఎంసీ ఘట్కేసర్ 6వ డివిజన్ కొండాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు....