📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.. నిత్య వ్యాయామం చేయాలి

ప్రపంచ హార్ట్ డే సందర్భంగా మేడ్చల్‌లో మెడినోవా ఆధ్వర్యంలో వాకథాన్

మేడ్చల్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలని, మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు పట్టణాల్లో వారం రోజులుగా నిర్వహించిన అవగాహన వాకథాన్ మంగళవారం మేడ్చల్ పట్టణంలో ముగిసింది.

సెప్టెంబర్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి ప్రారంభమైన వాకథాన్ భువనగిరి, అలియాబాద్, ఎంసీ పల్లి, గజ్వేల్, తూప్రాన్, చేర్యాల, చేగుంట తదితర ప్రాంతాల్లో కొనసాగింది. చివరి కార్యక్రమాన్ని మేడ్చల్ పట్టణంలోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

మెడినోవా హాస్పిటల్ నుంచి ప్రారంభమైన వాకథాన్ పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా వివేకానంద విగ్రహం వరకు కొనసాగి తిరిగి హాస్పిటల్ వద్ద ముగిసింది. మెడినోవా, మెడిసిటి హాస్పిటల్స్ సిబ్బందితో పాటు మేడ్చల్‌లోని స్ఫూర్తి కాలేజీ, ఎలివేట్ అకాడమీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ ఐనిష్ మర్చంట్ ముఖ్య అతిథిగా హాజరై వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె శరీరంలోని అత్యంత కీలకమైన అవయవమని, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని సూచించారు.

గుండెకు సంబంధించిన శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, ఏదైనా అనుమానం కలిగినప్పుడు వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

అనంతరం హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, మానసిక ప్రశాంతత గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఘన్‌పూర్‌లోనూ మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. ఘన్‌పూర్ మేడ్చల్ చౌరస్తా నుంచి హనుమాన్ గుడి మీదుగా రహదారిపై నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ నూనావత్ పార్వతి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. వాకథాన్ అనంతరం గ్రామస్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం ద్వారా గుండె ఆరోగ్యంపై అనేక విషయాలు తెలుసుకున్నామని గ్రామస్థులు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో డా. కుషాల్ సారంగత్, డా. రవి కుమార్, డా. మాధవ రెడ్డి, డా. పైజుద్దీన్, డా. మనోజ్ కుమార్, డా. వంశీకృష్ణ, డా. నవీన్ కుమార్‌తో పాటు హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.