📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

📰 Generate e-Paper Clip

*గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

*ప్రత్యేక పూజలు నిర్వహించారు

* నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిఎంఆర్

పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 14 (ప్రజావాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్‌) సోమవారం ఉదయం ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.