📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంగమ్మ ఒడిలోకి బాల గణపయ్య

గంగమ్మ ఒడిలోకి బాల గణపయ్య

📰 Generate e-Paper Clip

*గంగమ్మ ఒడిలోకి బాల గణపయ్య!

*ఓడీఎఫ్‌ కాలనీలో 11వసారి మట్టి వినాయకుడి ఉత్సవాలు*

*బాల గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి*

*నందారం నరసింహ గౌడ్‌ ఆధ్వర్యంలో 3 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ*

*రూ.2.50 లక్షలు పలికిన పెద్ద లడ్డు*

అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 (ప్రజావాణి):భక్తి.. పర్యావరణ పరిరక్షణ.. సేవా స్ఫూర్తి.. ఈ మూడు కలయికగా ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో వరుసగా 11వసారి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మట్టి గణపయ్యను ఆరాధిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని కాలనీ వాసులు చాటారు.
ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బాల గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు నిర్వాహకులు, కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు.

*3 వేల మందికి మహా అన్న ప్రసాదం*

అమీన్‌పూర్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నందారం నరసింహ గౌడ్‌ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాల గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

*రూ.2.50 లక్షలు పలికిన పెద్ద లడ్డు*

ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పెద్ద లడ్డు రూ.2.50 లక్షలు పలికింది. కరిమొళ్ళ ప్రసాద్‌–గాయత్రి దంపతులు పెద్ద లడ్డూను సొంతం చేసుకున్నారు. చిన్న లడ్డూను ఆకుల శివ–ఉదయశ్రీ దంపతులు రూ.112000 లకు దక్కించుకున్నారు.
పర్యావరణ హితమే లక్ష్యం
11వసారి కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ద్వారా ఓడీఎఫ్‌ కాలనీ వాసులు పర్యావరణ హిత ఉత్సవాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మట్టి గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రకృతికి హాని కలగకుండా ఉత్సవాలను కొనసాగించారు. అనంతరం బాల గణపతికి భక్తుల నినాదాల మధ్య శోభాయాత్ర కొనసాగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.