📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadసమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్ ఆయా

సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్ ఆయా

📰 Generate e-Paper Clip

11 అయినా తెరుచుకొని కుమ్మరి కుంట్ల అంగన్వాడి సెంటర్

– ఎస్సీ కాలనీ లో ఉన్న అంగన్వాడి సెంటర్ నిర్వాహకుల తీరు

–
సెంటర్లో తాళం తీసి విధులు నిర్వహించిన ఉపసర్పంచ్

 

దంతాలపల్లి
సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

 

దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామంలో సోమవారం ఉదయం11 గంటల సమయం అయినా కూడా అంగన్వాడి సెంటర్ తాళాలు వేసి ఉండడంతో స్థానికులు నివ్వర పోయారు. అంగన్వాడి సెంటర్లో చదువుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వెళ్ళినట్లు సమాచారం. అంగన్వాడి టీచర్ ఆయా అంతా మా ఇష్టం అన్న చందంగా సమయపాలన పాటించకుండా, గత కొద్ది రోజులుగా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ స్థానిక పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. దంతాలపల్లి మండల పరిధిలో ఉన్న సెక్టార్ లో పనిచేస్తున్న సూపర్వైజర్, పర్యవేక్షణ లోపం మూలంగానే, ఈ టీచర్ ఆయా తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. ఈ అంశాన్ని పై అధికారులకు తెలియజేయడంతో గ్రామ ఉపసర్పంచ్ అంగన్వాడి సెంటర్ కు తాళం తీసి సెంటర్లో కూర్చొని విధులు నిర్వహించడం చర్చ నియాంశంగా మారింది. కావున జిల్లా ఉన్నతాధికారులు
టీచర్ ఆయా నిర్లక్ష్యంపై వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అంగన్వాడీలో ఇలాంటి లోపాలు దుస్థితి కారణమేంటి సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి ఆ సెంటర్ పై సరైన చర్యలు తీసుకోవాలని లేకుంటే అంగన్వాడి సెంటర్ ముందు ఆందోళన చేపడతామని గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ఈ అంశంపై పెద్ద ముప్పారం సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ మంగాదేవిని వివరణ కోరగా, అంగన్వాడి టీచర్ ,ఆయా, తనను సెలవు అడిగకుండానే వేరే ఊరెళ్ళిందని, ఇద్దరు లేకపోవడంతో అంగన్వాడి సెంటర్ తాళం వేసి ఉండడం, తన దృష్టికి వచ్చిందని, ఈ సమాచారం డీ డబ్ల్యూ ఓ మేడంకుకూడా చేరిందని, ఈ అంశంపై అంగన్వాడీ టీచర్ , ఆయా కు మేము జారీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.