పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి
మృతుని కుటుంబానికి 5వేల ఆర్ధిక సహాయం
మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి,
జనగామ నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన వానరాసి చంద్రయ్య కుటుంబానికి ఆదరణగా 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈకార్యక్రమంలో మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి నలగొప్పుల రాజుగౌడ్,వార్డు మెంబర్ లు మల్లిగారి రంజిత్,గుండెగొని స్వాతి-రాకేష్,చింతల శైలజ – సంపత్, గ్రామ కాంగ్రెస్ ఇంచార్జి చింతల పాపిరెడ్డి,చెట్టుకూరి శ్రీశైలం,వేల్పుల ప్రకాశం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

