📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంగమ్మ ఒడికి తరలిన గణపయ్య

గంగమ్మ ఒడికి తరలిన గణపయ్య

📰 Generate e-Paper Clip

గంగమ్మ ఒడికి తరలిన గణపయ్య

• జోగిపేటలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

జోగిపేట, సెప్టెంబర్ 21: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

జోగిపేట పట్టణంలోని పబ్బతి హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వరుని నిమజ్జన శోభాయాత్రను జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, పుర ప్రముఖులు చాపల వెంకటేశం, పి. సురోతం రెడ్డి, సార శివకుమార్, పల్లె వెంకటరమణ, ఆనంద్ వర్ధన్, దిలీప్ జైన్, ఆకుల శంకర్, బిర్ల శంకర్, టి. హనుమంత్ కుమార్, అజిత్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.
శోభాయాత్రలో చిన్నారులు, బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా నినాదాలతో సందడి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.