📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadకొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ పేరు సర్వత్రా చర్చనీయాంశం.

కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ పేరు సర్వత్రా చర్చనీయాంశం.

📰 Generate e-Paper Clip

కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ పేరు సర్వత్రా చర్చనీయాంశం.

తండ్రి అడుగుజాడల్లో ఆదర్శ సేవలను కొనసాగిస్తూ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ళ సుధీర్.

వైస్ చైర్మన్‌గా విశేష సేవలు అందించిన అనుభవంతో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేసులో సుధీర్.

పోచారం శ్రీనివాసరెడ్డి,కాసులు బాలరాజు సహకారంతో సుధీర్‌కు ఖాయం కానున్న చైర్మన్ పీఠం!

కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా సుధీర్‌కు సంఘ సభ్యులు,రైతుల సంపూర్ణ మద్దతు!

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి సహకార సంఘం(సొసైటీ)నూతన చైర్మన్ పీఠంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ళ సుధీర్ పేరు నిలవడం ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ నాయకులు, సంఘ సభ్యులు,రైతులు ఏకగ్రీవంగా ముందుకువస్తున్నట్లూ సమాచారం.తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవను కొనసాగిస్తున్న సుధీర్ వైపు అందరూ సానుకూలత చూపి స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.కీర్తిశేషులు వెనిగళ్ళ భాస్కర్ రావు గతంలో 1980 నుండి 2000 సం.రం వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.అద్దె భవనంలో ఉన్న సొసైటీని సొంత భవనానికి మార్చడం సొసైటీకి చెందిన 4 టన్నుల రైస్ మిల్‌తో పాటు 1 ఎకరం 20 గుంటల భూమిని కొనుగో లు చేసి సంస్థను అభివృద్ధి బాటలో నడిపిన ఆయన ఘన తను రైతులు నేటికీ స్మరించుకుంటున్నారు.ఇదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వెనిగళ్ళ సుధీర్ సైతం 2013 నుండి 2020 వరకు కొత్తపల్లి సొసైటీ వైస్ చైర్మన్‌గా విశేష సేవలు అందించారు.ఆయన హయాంలో కొత్తపల్లిలో 500 మెట్రిక్ టన్నుల గోదాము,రైస్ మిల్ పక్కన మరో 250 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం,లింగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద భూమి కొనుగోలు,రాంపూర్‌లో పాత గోదాము మరమ్మతు లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.అదేవిధంగా రైతులకు సకాలంలో పంట రుణాలు,నాణ్యమైన విత్తనాలు అందజేయడంలో తండ్రి,తనయుల నిస్వార్థ పనితనం ఆద ర్శప్రాయంగా నిలిచింది.ప్రస్తుతం కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ బాధ్యతలు చేపడితే సొసైటీ మరింత వేగం గా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రైతులు, సంఘ సభ్యులు గాఢంగా విశ్వసిస్తున్నారు.గత అనుభవం, నిస్వార్థ సేవా తత్పరత ఉన్న సుధీర్‌కు చైర్మన్ పీఠం దక్కితే రైతులకు మరింత మేలు జరుగుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవ సాయ సలహాదారులు,బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసు ల బాలరాజు ల సంపూర్ణ ఆశీస్సులు సుధీర్‌కు మెండుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.అలాగే స్థానిక మండల ప్రముఖ నాయకుల చొరవతో పాటు వారికి లభిస్తున్న బలమైన నాయకత్వ సహకారంతో సుధీర్ ఎన్నిక లాంఛ నప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.నాయ కుల ఆశీస్సులతో కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్‌ ను నియమించాలని,ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సొసైటీ పరిధిలోని రైతులు,సంఘ సభ్యులు ఉద్ఘాటిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.