ప్రజావాణి – కూసుమంచి
సెప్టెంబర్ 17
కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం
కూసుమంచి, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) టి. జస్వంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రాధాన్యతను, ప్రజాస్వామ్య విలువలను, ప్రజల భాగస్వామ్యంతో సాగుతున్న పాలనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు
. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం అందరూ కలిసి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి, ప్రజాసేవా స్ఫూర్తి ప్రతిబింబించింది.

