📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaకూరెళ్ల శ్రీనివాస్‌ కు అభినందనల పరంపర

కూరెళ్ల శ్రీనివాస్‌ కు అభినందనల పరంపర

📰 Generate e-Paper Clip

కూరెళ్ల శ్రీనివాస్‌ కు అభినందనల పరంపర

చిత్రలేఖనంలో ప్రతిభా పురస్కారానికి ఎంపిక

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

2026 సంవత్సరానికి గాను చిత్రలేఖన రంగంలో ప్రతిభ కనబరిచినందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి కూరెళ్ల శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల చండూరు ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా చండూరు ప్రాంతానికి చెందిన సాహితీవేత్తలు, కళాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్రకళలో తన ప్రతిభను నిరంతరం ప్రదర్శిస్తూ, కళారంగానికి అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం ఒక గుర్తింపుగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. స్థానిక ప్రాంతం నుంచి కళారంగంలో ప్రతిభను చాటుకుంటూ విశ్వవిద్యాలయ స్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపిక కావడం చండూరు ప్రాంతానికే గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చండూరు సాహితీ మేఖల ప్రతినిధులు మంచుకొండ చిన్న బిక్షమయ్య, పున్న అంజయ్య, మద్దోజు సుధీర్ బాబు, డాక్టర్ సచ్చిదానందం, డాక్టర్ ఇడుకోజు శ్రీనివాస చారి, డాక్టర్ నిర్మలానంద, డాక్టర్ చిదానంద తదితరులు కూరెళ్ల శ్రీనివాస్‌ను అభినందించారు. అలాగే అఖిల భారత విశ్వకర్మ మహాసభ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి, చండూరు డివిజన్ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (వె.వా) అధ్యక్షులు మద్దోజు సుధీర్ బాబు, ప్రధాన కార్యదర్శి రామగిరి శ్రీనివాసాచారి, కోశాధికారి గన్నవరం శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు గన్నవరం రాము తదితరులు అభినందనలు తెలియజేశారు. చండూరు స్వర్ణకార సంఘం అధ్యక్షులు ముమ్మడి శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి ముప్పవరం ఆంజనేయులు, కోశాధికారి మద్దోజు నాగరాజు, చండూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం అధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు, గీతా విద్యాలయం అధినేత పోలోజు నరసింహాచారి, అలాగే చండూరు ఉన్నత పాఠశాల బోధన సిబ్బంది కూడా కూరెళ్ల శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రతిభకు గుర్తింపు లభించినప్పుడు అది వ్యక్తిగత విజయానికే పరిమితం కాకుండా, ఆ ప్రాంతంలోని యువతకు మరియు కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కూరెళ్ల శ్రీనివాస్ భవిష్యత్తులో చిత్రకళా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, చండూరు ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి ఎంపికైన కూరెళ్ల శ్రీనివాస్‌కు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.