వంతెన కూలిన ఘటనపై వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతున్న ఎమ్మెల్యే జారే
*రూ. 5 కోట్ల నిధులతో పాములేరు వాగుపై నూతన వంతెన నిర్మాణం -ఎమ్మెల్యే జారే ఆదినారాయణ*
ములకలపల్లి, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 24:
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ములకలపల్లి మండలం కంపగూడెం శివారులో కూలిపోయిన పాములేరు వాగు వంతెన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు త్వరలోనే రూ. 5 కోట్ల నిధులతో నూతన వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం వంతెన కూలిపోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న ప్రత్యామ్నాయ మార్గాలపై ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్ అండ్ బీ డీ.ఈ విశ్వనాథ్, ఎస్సై మధు ప్రసాద్, విద్యుత్ శాఖ ఏ.ఈ నరేష్ కుమార్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.పాల్వంచ వైపు వెళ్లే భారీ వాహనాలను సత్తుపల్లి మీదుగా దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు.అలాగే కార్లు, ద్విచక్ర వాహనాలను మాదారం, అన్నపురెడ్డిపల్లి, బుగ్గపాడు మీదుగా దమ్మపేటకు వెళ్లేలా, అదే విధంగా దమ్మపేట నుంచి వచ్చే వాహనాలను కంపగూడెం అడ్డరోడ్డు, తిమ్మంపేట, బూర్గంపాడు మీదుగా పాల్వంచకు చేరుకునేలా దారి మళ్లింపు ఏర్పాట్లు చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థను పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఆయా మండలాల అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి,మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్తి సుమిత్, సురభి రాజేష్ ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

