కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్స్ నూతన నాయకులకు ఘన సన్మానం
* మార్కెట్ యార్డు పూర్వవైభవానికి కృషి చేయాలని అడ్తి దారుల సంఘం పిలుపు
* రాష్ట్ర కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దొణకొండ మల్లారెడ్డి జిల్లా కాటన్ జిన్నింగ్
* ప్రెస్సింగ్ మిల్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్
జమ్మికుంట సెప్టెంబర్ 13 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట రాష్ట్ర కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దొణకొండ మల్లారెడ్డి జిల్లా కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్ లను అడ్తి దారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక అడ్తి దారుల సంక్షేమ సంఘ భవనంలో సంఘ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగిందిఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.పదవులు పొందిన ఇద్దరు నాయకులు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు పూర్వవైభవం తీసుకురావడానికి తమవంతు కృషి చేయాలని కోరారు. వర్తకులు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారులు అడ్తి దారులు దాడ్వాయిలు హమాలీలు సంఘ సభ్యులు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులను వారిని గజమాలతో శాలువాలతో సత్కరించారు

