📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకమలాపూర్ మండలం PASS మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం

కమలాపూర్ మండలం PASS మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం

📰 Generate e-Paper Clip

కమలాపూర్ మండలం PASS మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం: విచారణ జరిపి న్యాయం చేయాలనిMPDO కి వినతి పత్రం

ప్రజావాణి సెప్టెంబర్ 21 కమలాపూర్ మండల పరిధిలోని PASS (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ) ద్వారా ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్న సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు మరియు అక్రమాలు జరిగాయని వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్MPDO కి వినతి పత్రం సమర్పించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూPASS కొనుగోలు ప్రక్రియలో అనేక మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు

తక్కువ చెల్లింపులు దాదాపు 233 మంది రైతులకు₹1.2000 నుండి₹20. 0000 వరకు తక్కువ డబ్బులు చెల్లించారు
ట్రాఫిక్ రవాణా బకాయిలు 800 మందికి పైగా రైతులకు సంబంధించి నేటికి ట్రాక్ ఫీట్ రవాణా డబ్బులు చెల్లించలేదు
రైతులకు గన్ని బ్యాగులకు సంబంధించి రావాల్సిన మొత్తాన్ని కూడా జమ చేయలేదు

ఈ సమస్యపై గతంలో (03/06/2026) హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ సమస్యలు జ్యోతి గోడన్ వారు నష్టపోయిన రైతులకు త్వరలోనే డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా జమా కాలేదని గుర్తు చేశారు

కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి కమలాపూర్ మండల రైతులందరికీ రావలసిన బకాయిలను చెల్లించి తగిన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రెక్కల నారాయణరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండా తిరుపతి మరియు నకిర్త రామచందర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.