📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణేష్ మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి

గణేష్ మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

గణేష్ మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి

 

 

మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్

 

 

మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి,

 

 

 

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహకులకు పలు మార్గదర్శకాలను ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ వెల్లడించారు. గణేష్ మండపాలు,విగ్రహాల రవాణా నిర్వాహకుల వివరాలను సంబంధిత ఆన్లైన్ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు పోలీసు నిబంధనల ప్రకారం మండపాల ఏర్పాటుకు ముందే అనుమతి తీసుకోవాలని సూచించారు ప్రతి మండపం వద్ద 24 గంటలు కనీసం ఇద్దరి వ్యక్తులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల పేరుతో ప్రజల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేయరాదని హెచ్చరించారు అలాగే మండపాల వద్ద లక్కీ డ్రా లు జూదం తరహా కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.మండపాల వద్ద బాధ్యత ప్రమాణాలను పాటించాలని ఎస్సై సూచించారు.గణేష్ ఉత్సవ నిర్వాహకులు భక్తులు పోలీసు శాఖకు సహకరించి పండుగను శాంతియుతంగా సురక్షితంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.