*ఇంకా పెండింగ్ లోనే మత్స్యశాఖ ఫైలు…?
*చర్యలు తీసుకునేందుకు వెనకడుగు…?
*సహకార సంఘాల చట్టం నిబంధనలకు తూట్లు…?
*ప్రకటనలకే పరిమితమైన జిల్లా మత్స్యశాఖ అధికారి తీరు…?
*సర్వసభ్య సమావేశం తో పాటు నోటీసులు పంపిన స్పందించని జిల్లా మత్స్య శాఖ ఏడి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలపై సంఘం సభ్యులతో పాటు పాలకవర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గ్రామాలకు చెందిన ఓ మైనర్ చేపల చెరువు వ్యవహారానికి సంబంధిత రాష్ట్రస్థాయి అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లాస్థాయి అధికారులు పెద్దగా ఆదేశాలను పాటించే దిశగా చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 సంవత్సరంలోని సెక్షన్ 23 ప్రకారం కొన్ని నిబంధనలు పాటిస్తూ సంఘ వ్యతిరేకంగా పనులు నిబంధనల ఉల్లంఘనలు ఆర్థిక లావాదేవీల ఎగవేత లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోని సంబంధిత సంఘంలోని వ్యక్తులను సొసైటీ నుండి తొలగించే వీలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో నాటి ఏడి బహిరంగ విచారణ చేసి వాస్తవాలను నివేదిక రూపంలో పొందుపరిచి రాష్ట్రస్థాయి అధికారులకు అందించిన నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాల్సిన ఖమ్మం జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా సహకార సంఘాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఒక సంఘం మాజీ అధ్యక్షుడు నీ పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సంఘం మూడు సార్లు సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆ మాజీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగించడంతోపాటు రికవరీ చెల్లించినందున సంబంధిత జిల్లా స్థాయి అధికారులు ఇటీవల స్థానిక చింతకాని పోలీస్ శాఖ వారికి అధికారికంగా లేఖ రాసినప్పటికీ సంబంధిత మత్స్యశాఖ జిల్లా అధికారులు ప్రధానంగా ఏడి ఆ దిశగా చర్యలు తీసుకోలేదనేది విస్మయం కలిగిస్తోందని సమాచారం. మూడు తీర్మానాలు తో పాటు మూడు నోటీసులు కూడా మాజీ అధ్యక్షుడుకు అధికారికంగా అందించిన పాలకవర్గం సంఘం సభ్యులు అనంతరం స్థానిక చింతకాని పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పైగా ఇటీవల ఖమ్మం జిల్లాకు బదిలీపై వచ్చిన మత్స్యశాఖ ఏడి మల్లేశంకు ఇటీవల సంఘం బాధ్యులు అధికారికంగా మరొక దరఖాస్తును అందించినట్లు తెలిసినప్పటికీ ఉన్న నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన మత్స్య శాఖ ఏడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంఘం తీర్మానాలు నోటీసులు తో పాటు అధికారికంగా మత్స్యశాఖ ఏడి జిల్లా సహకార రిజిస్టార్ (అధికారి) కి తదుపరి చర్యల నిమిత్తం సిఫారసు చేస్తూ అధికారికంగా లేఖ అందించాల్సి ఉంటుందని తెలిసింది. నేటి వరకు జిల్లా సహకార రిజిస్టార్కు సిఫారసు చేయలేదని మళ్లీ గ్రామానికి నలుగురు చొప్పున సభ్యులు జిల్లా కార్యాలయానికి రావాలని ఏడీ సూచించడం వెనుక పలు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరించాల్సిన జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు నెలలు గడుస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీర్మానాలను నోటీసులను గతంలో రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలను చేసిన విచారణలను ప్రామాణికంగా తీసుకోని సభ్యత్వం తొలగించడంతోపాటు రికవరీ ప్రక్రియ పూర్తి చేయాలని పలువురు మత్స్యకారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

