📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఆరుట్ల కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం

ఆరుట్ల కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం

📰 Generate e-Paper Clip

ఆరుట్ల కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం

మంచాల, సెప్టెంబర్ 14 (ప్రజావాణి):
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సోమవారం గౌడ సంఘం పెద్దలు, దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 28వ సోమవారానికి చేరుకుంది. శివస్వాముల గురుస్వామి లొంగరి యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ 28వ సోమవారం అన్నదాన కార్యక్రమానికి మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నేరెళ్ల శంకర్, మాడపాకుల శ్రీనివాస్ అన్నదాన ప్రభువులుగా వ్యవహరించారు. ముందుగా కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ నేరెళ్ల శంకర్, మాడపాకుల శ్రీనివాస్‌తో పాటు గౌడ సంఘం సభ్యులు అంతటి రాజుగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్, వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్ తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో సుంకరి జంగయ్యగౌడ్, గురుస్వాములు కావలి శ్రీనివాస్ ముదిరాజ్, లొంగరి దాసు, మాడపాకుల యాదగిరి, సుంకరి లచ్చయ్యగౌడ్, కాసుల జంగయ్య, అంతటి వెంకటేష్ గౌడ్, బత్తుల సురేష్ గౌడ్, బుడిగల జంగయ్య, జిలమోని శేఖర్ ముదిరాజ్, బుస్సురాజు ముదిరాజ్, చిందం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.