ఆరుట్ల కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం
ఆరుట్ల కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానంమంచాల, సెప్టెంబర్ 14 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సోమవారం గౌడ సంఘం పెద్దలు, దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 28వ సోమవారానికి చేరుకుంది. శివస్వాముల గురుస్వామి లొంగరి యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ 28వ సోమవారం అన్నదాన కార్యక్రమానికి మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నేరెళ్ల శంకర్, మాడపాకుల శ్రీనివాస్ అన్నదాన ప్రభువులుగా వ్యవహరించారు. ముందుగా కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు....