📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakఅసెంబ్లీ వద్ద దాడి.. ప్రజాస్వామ్యానికి మచ్చ!

అసెంబ్లీ వద్ద దాడి.. ప్రజాస్వామ్యానికి మచ్చ!

📰 Generate e-Paper Clip

అసెంబ్లీ వద్ద దాడి.. ప్రజాస్వామ్యానికి మచ్చ!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటారా

 

సీఎం రేవంత్ రెడ్డిపై శేరీ సుభాష్ రెడ్డి ఫైర్

 

మెదక్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆగ్రహం

 

మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 7

 

ప్రజా సమస్యలపై పోరాడితే అడ్డుకుంటారా?

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. త్వరలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శన

మెదక్: అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడికి పాల్పడటం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు.

“ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఎమ్మెల్యేలనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం?” అని శేరీ సుభాష్ రెడ్డి ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలకే భద్రత లేదా?

గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, వారిపై దాడులు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలపై సెటైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న . తగిన గుణపాఠం చెప్తాం

ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టులపై ప్రజాక్షేత్రంలో పోరాటం

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను ప్రజలతో కలిసి సందర్శిస్తామని శేరీ సుభాష్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అక్కడే చర్చించి, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని వెల్లడించారు.

హైలైట్

అసెంబ్లీలో ప్రశ్నించే హక్కును అడ్డుకోలేరు.. ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తాం:

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ యువ న్యాయవాది జీవన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్లు బిఆర్ఎస్ కార్యకర్తలు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.