📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం

అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం

📰 Generate e-Paper Clip

*అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం*

*1.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం*

మేడ్చల్, ప్రజావాణి
పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఇందులో భాగంగా రూ.1.38 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ మురుగునీటి కాలువల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై కౌన్సిల్ చర్చించింది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి, కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.