అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం

*అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం* *1.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం* మేడ్చల్, ప్రజావాణి పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా అలియాబాద్ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఇందులో భాగంగా రూ.1.38 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ మురుగునీటి కాలువల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధి...