📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఅతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నల్లగొండ నందు 2026-27 విద్యా సంవ్సరానికి గాను ఖాళీగా ఉన్న యు.జి. మరియు పి.జి. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ సముద్రాల ఉపేందర్ తెలియజేసారు. పీ.జి లో 55 శాతం మార్కులు ఉ న్నవారు అర్హులు యస్.సి, యస్.టి వారికి పీ.జి లో 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు, పి.హెచ్.డి/నెట్/సెట్ మరియు బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి. యు.జి. కోర్సుల్లో తెలుగు -01 రాజనీతిశాస్త్రం – 01 ఖాళీలున్నట్లు ఆయన తెలిపారు. పి.జి కోర్సుల్లో యం.యస్సీ కంప్యూటర్ సైన్స్ – 01 ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయములో తేది.18-09-2026 సాయంత్రం 4.00 గం|| లోగా అందజేయగలరని తెలియజేశారు. దరఖాస్తు లో తమ ఎస్సేస్సీ, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పి.జి, పిహెచ్.డి, నెట్, సెట్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తేది. 19-09-2026 ఉదయం 10.30 గం॥లకు కళాశాల లో ఇంటర్వూకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.