📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

*అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు.*

*భాషల మధ్య వారధి.. అనువాదం…*

*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబరు 29*

భాషా వైవిధ్యంతో కూడిన ప్రపంచంలో ప్రజల మధ్య అవగాహన , సమాచార మార్పిడి , సాంస్కృతిక సమన్వయానికి అను వాదం కీలకంగా నిలు స్తోంది. అనువాదకుల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు. దేశాలు , భాషలు , సంస్కృతుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అనువాదకులు జ్ఞానాన్ని ఒక భాష నుంచి మరొక భాషకు చేర వేస్తున్నారు. సాహిత్యం , విద్య , విజ్ఞానం , న్యాయ వ్యవస్థ , వైద్యంశ, వాణిజ్యం , దౌత్య రంగాల్లో వారి సేవలు ఎంతో ప్రాధాన్యమైనవిగా భావిస్తున్నారు.

*సెయింట్‌ జెరోమ్‌ స్మరణగా…*

బైబిల్‌ను లాటిన్‌ భాష లోకి అనువదించిన సెయింట్‌ జెరోమ్‌ జ్ఞాప కార్థం ఈ దినోత్సవాన్ని సెప్టెంబరు 30న జరుపు తున్నారు. అనువాదకుల అంతర్జాతీయ సమాఖ్య 1953లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1991లో ఈ దినోత్సవానికి అధికారిక గుర్తింపు ఇవ్వా లని సమాఖ్య ప్రతి పాదించగా..2017లో ఐక్య రాజ్యసమితి సాధారణ సభ అధికారికం గా గుర్తించింది.

*‘అర్థం చేసుకునే శక్తి’…*

ఈ ఏడాది అనువాద దినోత్సవం ప్రధానంగా భాషా వైవిధ్యం , భాషా హక్కుల ప్రాధాన్యాన్ని చాటుతోంది. ‘అర్థం చేసు కోబడే శక్తి’ అనే సందేశం తో భాషా సమానత్వం , అందరికీ సమాచారం అందుబాటులో ఉండటం, మాతృభాషల పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు.
సాంకేతికతతో కొత్త సవాళ్లు కృత్రిమ మేధ , యంత్ర అనువాద సాధనాలు వేగంగా అభివృద్ధి చెందు తున్నప్పటికీ..భావం , స్థానిక సంస్కృతి , సామెతలు , మానవ అను భూతులను కచ్చితంగా వ్యక్తీకరించడంలో నిపుణు లైన అనువాదకుల పాత్ర కొనసాగుతూనే ఉంది. పదాలకు పదాలు మార్చడం మాత్రమే కాకుండా..ఒక సంస్కృతి లోని భావాన్ని మరో సంస్కృతికి సహజంగా చేరవేయడం అను వాదకుల ప్రత్యేక నైపుణ్యం. అనువాదం కేవలం భాషా మార్పిడి కాదు..ప్రజలను , ఆలో చనలను , సంస్కృతులను కలిపే వారధి. ప్రపంచ శాంతి , సహకారం , పరస్పర గౌరవానికి ఇది బలమైన పునాది వేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.