అంకిరెడ్డిపల్లిలో నిరాశ్రయులైన అంధ వృద్ధ దంపతులకు ప్రభుత్వ సహాయం
కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ బాధ్యత
అంకిరెడ్డిపల్లి: అంకిరెడ్డిపల్లి గ్రామంలో 85 ఏళ్ల వృద్ధుడు ఏ. స్వామి (కంటి చూపు లేని అంధుడు), ఆయన భార్య శివమ్మ దంపతులు ఇద్దరికీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు లేకుండా, ఇల్లు లేకుండా రోడ్డు పక్కన కంబళి కప్పుకొని జీవిస్తున్న దుస్థితిపై కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ స్పందించారు. వృద్ధ దంపతులకు బట్టలు, వారికి సరిపడా వస్త్రాలు, తిండికి కావలసిన నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. గత పదేళ్లుగా అంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఈ వృద్ధులకు తిండి, ఆహార పదార్థాలు ఇస్తున్నారు. ఇది మన అంకిరెడ్డిపల్లి గ్రామం యొక్క గొప్పతనం. మన ప్రజలకు సాయం చేసే గుణం ఉందని నేను గర్వంగా చెబుతున్నాను. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు గారికి అక్కడే ఉండి ఫోన్ ద్వారా వృద్ధుల గురించి చెప్పడంతో ఆయన వెంటనే స్పందించారని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐదు రోజుల్లో వృద్ధ దంపతులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్ మంజూరు చేసి, ప్రభుత్వ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు దివ్యాంగుల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నందున, ఆ తేదీలోపు ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ఇప్పిస్తానని వి. హనుమంతరావు గారు హామీ ఇచ్చారని శ్రీనివాస్ పేర్కొన్నారు. వి.హనుమంతరావు గారికి, కీసర మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు శ్రీనివాస్ తెలిపారు.

