80 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దుప్పట్ల పంపిణీ
ప్రజావాణి/టేకుమట్ల :
మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సర్పంచ్ వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 6వార్డు సభ్యురాలు బొంగోని వైష్ణవి జన్మదిన సందర్భంగా 6 వార్డులోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి తన మానవత దృఢత్వాన్ని చాటుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆరో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని బొంగోని వైష్ణవి నరేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వ్యాసనావేణి శ్రీలేఖ సతీష్ రావు , ఉపసర్పంచ్ శాస్త్రాల సమ్మయ్య, వార్డ్ మెంబర్లు బోల్లికొండ రాజన్న , అంబుల కుమారస్వామి, కన్నూరీ సదయ్య, కోడారి సుజాత రాజు,వాసాల నీల రవి, చిట్యాల ప్రమీల పెద్ద పోశాలుగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

