మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీ నందు ఘనంగా బొజ్జ గణపయ్యకు పూజలు.
ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. పట్టణ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో వేంచేసి ఉన్న ఘనపయ్యకు ప్రతిరోజు పూజలు వేదమంత్రాల నడుమ భక్తి భక్తిశ్రద్ధలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని అనగా కుంకుమార్చన భజన కార్యక్రమాలు కోలాటం భగవద్గీత పారాయణం లాంటి కార్యక్రమాలతో ఘనపయ్య భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్జస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ డాక్టర్స్ కాలనీలో గణేష్ నవరాత్రుల ఏర్పాటుకు సహకరించిన డాక్టర్లకు మరియు మెడికల్ షాప్ ఓనర్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
మిగిలిన కార్యక్రమాలు కూడా అంతే భక్తిశ్రద్ధలతో చేసి ప్రతి ఒక్కరు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్య వృత్తి వ్యాపారాలలో రాణించాలని కోరారు.

