ఘనంగా దొంతుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
టేకుమట్ల/ప్రజావాణి:
జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద దొంతుల శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తున్న దొంతుల శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో
జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాలు కలగాలని కోరారు.ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు దొంతుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు ఆడెపు సంపత్, మండల ఉపాధ్యక్షులు మాదం కొమురయ్య, మోతె రాజమౌళి, బండి రవీందర్, మండల కోశాధికారి శాస్త్రాల కిరణ్, బీసీ మండల అధ్యక్షులు తోడేటి కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు కుర్రే మల్లయ్య, అంబాల కిరణ్, కూర వెంకట రాజిరెడ్డి, నాంపల్లి వీరేశం, దిలీప్ రెడ్డి, తోట సునీత–సాగర్, నేరెళ్ల రామకృష్ణ, వంగ మమత–శ్రీధర్, మారం రచన–శ్రీకాంత్, గునిగంటి రజిని–మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

