📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

23 గ్రామాల అధ్యక్షులతో ఆటో జేఏసీ సుల్తాన్‌బాద్ మండల సమావేశం వి

ఆటో సంక్షేమ బోర్డు హామీలు అమలు చేయాలని డిమాండ్ – ‘ఫస్ట్ టూ లాస్ట్ ఆర్టీసీ ఆటో’ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని నేతల హెచ్చరిక

సుల్తాన్‌బాద్ (ప్రతినిధి):

సుల్తాన్‌బాద్ మండలంలో 23 గ్రామాల అధ్యక్షుల సమక్షంలో ఆటో జేఏసీ మండల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జ్ జేరిపోతుల కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న ‘ఫస్ట్ టూ లాస్ట్ ఆర్టీసీ ఆటో’ కార్యక్రమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.

ఆటో డ్రైవర్లను మభ్యపెట్టే విధంగా ఉన్న ఇలాంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నేతలు స్పష్టం చేశారు. జిల్లా కన్వీనర్ ఎనగందుల నాంపల్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కమిటీ, టౌన్ కమిటీని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ ఎస్.కే. జబ్బర్, మడిపెద్ద రమేష్, సురేష్, స్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.