📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadతల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం.

తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం.

📰 Generate e-Paper Clip

తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం.

సర్పంచ్ ఉదయ భాస్కర్.

హంగర్గ గుట్టలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.

 

కోటగిరి/ప్రజావాణి:-పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అని హంగర్గ గ్రామ సర్పంచ్ ఉదయ భాస్కర్ పేర్కొన్నారు.సోమవారం పొతంగల్ మండలంలోని హంగర్గ గుట్ట అంగన్వాడీ సెంటర్ కోడ్ 318లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించా రు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నీరడి భాస్కర్,గ్రామ కార్యదర్శి గంగారాం హాజరై తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి ఉదయభాస్కర్,అంగన్వాడీ టీచర్ ఎన్.శారద మాట్లాడుతూ పుట్టిన 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,తల్లిపాలు సంపూర్ణ ఆహారమని తెలిపారు.తల్లిపాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఎదుగుదల బాగుంటుందని,ప్రతి తల్లి తల్లిపాలను ప్రోత్సహించాలని సూచించారు.తల్లి పాలతో పాటు సమతు ల ఆహారం తీసుకోవడం వల్ల తల్లి,బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు.అనంతరం ఆశావర్కర్ సమత టీకాల ప్రాముఖ్యత గురించి వివరించారు.తదనంతరం సెంటర్ లోని చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తల్లులు,గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.