📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiri22ఏ క్లియరెన్స్‌కు కలెక్టర్ ప్రత్యేక దృష్టి

22ఏ క్లియరెన్స్‌కు కలెక్టర్ ప్రత్యేక దృష్టి

📰 Generate e-Paper Clip

“22ఏ క్లియరెన్స్‌కు కలెక్టర్ ప్రత్యేక దృష్టి*

*స్లాట్ బుక్ చేసుకునే నాటికే భూములకు క్లియరెన్స్*

*పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగం*

మేడ్చల్, ఆగస్టు 19 (పీపుల్స్ డైరీ):- భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయాలకు వచ్చే సమయానికి సంబంధిత భూమికి 22ఏ క్లియరెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు.

*పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక నజర్*

బుధవారం మేడ్చల్ మండలంలోని సబ్‌-రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. 22ఏ జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అప్‌డేట్ చేసిన జాబితా ప్రకారం ప్రతి దరఖాస్తును పరిశీలించి, అర్హత ఉన్న వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు.

*సర్వే నంబర్ల వారీగా పరిశీలన*

మేడ్చల్, దుండిగల్ తహసీల్దార్ల వద్ద ఉన్న 22ఏ జాబితాలోని దరఖాస్తులను సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న జాబితాలతో సరిపోల్చాలని కలెక్టర్ ఆదేశించారు. లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి, పూర్తి స్థాయి వెరిఫికేషన్ అనంతరం సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

*యూఎల్‌సీ కేసులకు ప్రత్యేక ప్రాధాన్యం*

యూఎల్‌సీ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి క్లియర్ చేయడంలో జాప్యం ఉండకూడదన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఇబ్బందులు లేకుండా..
ప్రజలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కార్యాలయానికి వచ్చి 22ఏ సమస్య కారణంగా లావాదేవీ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్లాట్ బుక్ చేసుకునే నాటికే సంబంధిత భూమి వివరాలను పరిశీలించి క్లియరెన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

*ప్రజలకు సులభతరమైన రిజిస్ట్రేషన్ లక్ష్యం*

22ఏ నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఆశోక్, మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, దుండిగల్ తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.