పోరుమామిళ్ల, ఆగస్టు 27: ప్రజావాణి కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని స్థానిక బాలమ్మ వృద్ధాశ్రమం (సత్రం)లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు కార్యక్రమంలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో నల్లేరు విశ్వనాథరెడ్డి పార్టీ నాయకులు, వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు మరియు నిరుపేదలకు పండ్లు, స్వీట్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా, మధ్యాహ్నం వేళ వృద్ధులందరికీ నల్లేరు విశ్వనాథరెడ్డి స్వయంగా ప్రత్యేక భోజన వసతిని ఏర్పాటు చేసి, వారికి వడ్డించారు. ఆశ్రమంలోని వృద్ధులతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా నాయకుడు – నల్లేరు విశ్వనాథరెడ్డి:


