సేవా కార్యక్రమాలతో వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు: వృద్ధులకు అన్నదానం, పండ్ల పంపిణీ చేసిన బద్వేల్ నియోజకవర్గ వైయస్సార్సీపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి,
పోరుమామిళ్ల, ఆగస్టు 27: ప్రజావాణి కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని స్థానిక బాలమ్మ వృద్ధాశ్రమం (సత్రం)లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు కార్యక్రమంలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో నల్లేరు విశ్వనాథరెడ్డి పార్టీ నాయకులు, వృద్ధుల సమక్షంలో కేక్...