📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyసంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో అబద్ధాలు మాట్లాడుతున్నారని, గతంలో జరిగిన విషయాలను పదేపదే ప్రస్తావించడం సరికాదన్నారు.

సంగారెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి ఆగస్ట్ :11

పాస్‌పోర్ట్ బ్రోకర్ కేసులో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని, చట్టపరమైన ప్రక్రియలోనే కేసు నమోదైందని తెలిపారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ విషయంలోనూ జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి వైఖరిని ప్రశ్నించిన చింత ప్రభాకర్, కేసీఆర్–హరీష్ రావు సహకారంతో సంగారెడ్డిలో వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు.

“సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసినా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవడం అసాధ్యం” అని చింత ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు మానుకుని సంగారెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.