📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip

  • *విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు...*

 

*సమస్యలపై మాట్లాడితే రాజకీయ బురద చల్లడం అవివేకం…*

 

*తప్పుడు ఆరోపణలు చెస్తే చెప్పు దెబ్బల పాలే…*

 

తేది:04.08.2026

భూపాలపల్లి

 

ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వాక్యాలపై బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

 

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…*

 

నిన్న మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

 

ఈ భూపాలపల్లి నియోజకవర్గం 2009లో ఏర్పడింది.గండ్ర వెంకట రమణా రెడ్డి గారు 2007–2009 వరకు ఎమ్మెల్సీగా, అనంతరం 2009–2014 మరియు 2018–2023 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చిప్ విప్ గా ఈ ప్రాంతానికి సేవలందించారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి అనేక రంగాల్లో కృషి జరిగింది.

 

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

 

ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్బా, మైనారిటీ విద్యాలయాలను, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

 

మైనారిటీ పాఠశాలలకు సంబంధించి గతంలో విద్యార్థులకు వేర్వేరు భవనాల్లో మెరుగైన వసతులు కల్పించగా, ప్రస్తుతం మారిన ఏర్పాట్ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు, పరిశుభ్రత, పిచ్చి మొక్కల పెరుగుదల, విషసర్పాలు మరియు విషపురుగుల భయం వంటి సమస్యలు విద్యార్థుల భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావడమే మా నాయకుడి ఉద్దేశం. దీనిని రాజకీయ కోణంలో చూడడం కాంగ్రెస్ నాయకుల అవిజ్ఞానానికి, వారి యొక్క అవగాహనా లేమికి నిదర్శనము అని ఏద్దేవా చేశారు.

 

అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం వంటి అంశాలపై ఉన్న లోపాలను ఆయన ప్రస్తావించారు.

 

అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీడియా ద్వారా ప్రజల ముందుకు, ప్రభుత్వాన్నికి తెలియచేశారు.

 

ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కనిపించలేదని తెలియజేశారు.

 

జిల్లా ఆసుపత్రిలో, మైనారిటీ స్కూల్లో అన్నీ సక్రమంగానే ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

 

వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే మాతో మీరు రండి మీడియా ప్రతినిధులతో కలిసి ఆసుపత్రిని సందర్శింద్దాం.

 

ఎవరూ రాజకీయం చేస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలుస్తుంది అని అన్నారు.

 

అదేవిధంగా, మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం, నిర్ధారణలేని ఆరోపణలు చేయడంసరైంది కాదు.ఎవరిపైనా ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు ఉండాలి.

 

ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదు.

 

కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

 

మీ నాయకులే ప్రస్తుత ఎమ్మెల్యే తిరుపతి లో హోటల్స్ కడుతున్నాడు అని, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొంటున్నాడు అని, బట్టల షాపుల్లో షేర్ ఉందని చెప్పుతున్నారు.

 

మా నాయకులపై ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా బిఆర్ఎస్ కార్యకర్తల చేతులో చెప్పు దెబ్బల పాలు అవుతారు అని హెచ్చరించారు…….

Previous article
సగిలేరు వాగులో అక్రమ మట్టి మాఫియా డీకేటీ భూముల్లో నిబంధనలకు పాతర.నిమ్మకు నీరెత్తిన అధికారులు**సగిలేరు వాగులో అక్రమ మట్టి మాఫియా డీకేటీ భూముల్లో నిబంధనలకు పాతర.నిమ్మకు నీరెత్తిన అధికారులు* కాశినాయన ( ఆగస్టు 4 ప్రజావాణి ): మండలంలో ఇసుక, మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. సగిలేరు డ్యామ్‌కు సంబంధించిన వాగు పరివాహక ప్రాంతంలో, ప్రసిద్ధ వివేకానంద ఆశ్రమం వెనుక భాగంలో జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పగలు రేయి తేడా లేకుండా యంత్రాలతో మట్టిని తరలిస్తుండటంతో ప్రకృతి సంపద పూర్తిగా ధ్వంసమవుతోంది, డీకేటీ భూముల్లో తవ్వకాలు. పర్మిషన్ ఎక్కడ ? అక్రమ త్రవ్వకాలు జరుగుతున్న సదరు భూమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘డీకేటీ’ (ధారఖాస్తు ఖరారు పట్టీ) భూమి కావడం ఇక్కడ గమనార్హం. నిరుపేదల సాగు కోసం లేదా ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించే ఇలాంటి భూముల్లో వాణిజ్య పరమైన త్రవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఉండవు. మరి అలాంటిది, ఈ నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి మట్టిని ఎలా తోడుతున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి మైనింగ్ లేదా రెవెన్యూ అధికారులు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ముడుపుల పర్వం.. అధికారుల మూగనోము! ఈ అక్రమ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల హస్తం, అధికారుల కుమ్మక్కు ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు అనుమతులే లేని చోట ఇంత బహిరంగంగా త్రవ్వకాలు జరుగుతున్నా, స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను కప్పిపుచ్చడానికి మరియు అధికారులను మచ్చిక చేసుకోవడానికి లక్షల రూపాయల ‘ముడుపులు’ చేతులు మారాయనే అపోహలు, విమర్శలు ప్రజల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రమాదకరంగా మారిన గుంతలు.. మూగజీవాలకు మృత్యుపాశాలు నిబంధనలకు విరుద్ధంగా వాగు గర్భాన్ని నచ్చినట్లు తవ్వేస్తుండటంతో అక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. చాలా లోతుగా, ప్రమాదకరంగా ఈ త్రవ్వకాలు జరపడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తిరిగే ఆవులు, గేదెలు వంటి మూగ జీవాలు ప్రమాదవశాత్తూ ఆ వాగులోకి వెళ్తే, తిరిగి బయటకు రాలేని భయానక పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని పశువులు ఆ లోతైన గుంతల్లో చిక్కుకుపోయే ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాయని కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో భారీ వర్షాలు పడితే ఈ గుంతలు నీటితో నిండి,అటు పశువులకే కాక అటుగా వెళ్లే మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. తక్షణమే స్పందించాలి పవిత్రమైన వివేకానంద ఆశ్రమం వెనుక భాగంలో, సగిలేరు వాగు పరిధిలో జరుగుతున్న ఈ దోపిడీని తక్షణమే అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని, అసలు పర్మిషన్లు ఉన్నాయో లేదో తేల్చాలని, బాధ్యులైన మైనింగ్, రెవెన్యూ అధికారులపై మరియు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల ప్రజలు ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.