📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 25 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపవుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.