EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొకరి పరిస్థితి విషమం.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొకరి పరిస్థితి విషమం.

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొకరి పరిస్థితి విషమం.

మఠంపల్లి ఆగస్టు 1 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా కోదాడ జడ్చర్ల నేషనల్ హై వే 167 పై చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనం బోలేరో ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మృతుడు మఠంపల్లి మండలం అవరేణి కుంట తండా గ్రామానికి చెందిన భూక్య నరసింహ(19) ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తుండగా మఠంపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. సీరియస్ గా ఉన్న మరో వ్యక్తి భోజ్య తండా కు చెందిన గుగులోతు గోపి రాములు (కొండా) గా గుర్తించారు. స్థానికులు 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ భూక్య నరసింహ మృతి చెందాడని నిర్దారించారు. గుగులోతు గోపి రాములు (కొండా)ఆరోగ్య పరిస్తితి అత్యంత విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. భూక్య నరసింహ మృతితో ఆవరేణికుంట తండా మరియు మఠంపల్లి గ్రామాలలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.