EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetప్రపంచ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య. 

ప్రపంచ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య. 

📰 Generate e-Paper Clip

ప్రపంచ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య.

 

మఠంపల్లి ఆగస్టు 1 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం (డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్) “ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి ఒక పెద్ద శాపమని, దీనిని రూపుమాపడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలో అమ్మాయిలు, యువతులు సోషల్ మీడియా వాడకంలోనూ, కొత్త పరిచయాల విషయంలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఉపాధి, మరియు ఉద్యోగాల మోసపూరిత మాటలు చెప్పే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చదువు చెబుతుంది. మహిళలు మరియు బాలికల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లను (ఉదాహరణకు: 1098, 181) అందుబాటులో ఉంచడం, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు, ఉపాధ్యాయులకు లేదా కుటుంబ సభ్యులకు వెంటనే తెలియజేయాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్ ఏంటిఎస్ భవ్య మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన సదస్సు విద్యార్థులలో ఎంతో చైతన్యాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.