📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadయాతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాముల సంచారం

యాతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాముల సంచారం

📰 Generate e-Paper Clip

యాతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాముల సంచారం

తొర్రూర్ పట్టణ కేంద్రంలోని యతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాములు సంచరిస్తున్నట్టు పార్కు పక్కన, నివాసం ఉంటున్న కుటుంబాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువ పాము పార్కు గోడ వెంట సంచరిస్తుంటే అక్కడ ఉన్న వీధి శునకాలు, మొరగడంతో చుట్టుపక్కన ఉన్న ప్రజలు బయటికి వచ్చి గమనించడంతో కొండచిలువ పాము కనిపించడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇది పిల్ల పాము మాత్రమేనని తల్లి కొండచిలువ కూడా యతి రాజారావు పార్కు పక్కనే ఉన్న, మురికి నీటి గుంటలో ఉండి ఉండవచ్చు అని స్థానికులు చెప్పుకొస్తున్నారు. కావున తొర్రూర్ మున్సిపల్ పాలకవర్గం స్థానిక కమిషనర్ ఈ అంశంపై స్పందించి, యతి రాజారావు పార్క్ చుట్టుపక్కల, పాములను గుర్తించి పాములను పట్టుకునే, వారిని పిలిపించి కొండచిలువ పాముల జాడలను గుర్తించి, వాటిని పట్టించాలని, ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా నిరంతరంగా ఈ పార్కులోకి పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా, క్రీడా ప్రాంగణంలో ఆటలాడుకుంటారని, కావున కొండచిలువ పాము సంచారం కనిపించడంతో, అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ కొండచిలువను గమనించిన స్థానిక ప్రజలు దానిని చంపడం జరిగిందని తెలిపారు. కావున తొర్రూరు మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి కొండచిలువ పాముల, ప్రమాద బారిన పట్టణ ప్రజలు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.