ఘట్‌కేసర్, ఆగస్టు 26: మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నివాసంలో బుధవారం యమనంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోలగొని సహదేవ్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ 8వ డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలగొని సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి యమనంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు, 8వ డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజల కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోచారం మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇటికల కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, దేవాదాయ డైరెక్టర్ పోలగొని లక్ష్మణ్ గౌడ్, మీసాల సుభాష్, పోలగొని మాణిక్యం, రేగు సత్యనారాయణ, సగ్గు జగన్, భాషగాని నాగరాజు, గండిపెళ్లి ప్రేమ్ కుమార్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


