యమనంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోలగొని సహదేవ్ గౌడ్‌కు నియామక పత్రం

ఘట్‌కేసర్, ఆగస్టు 26: మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నివాసంలో బుధవారం యమనంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోలగొని సహదేవ్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 8వ డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలగొని సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి యమనంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు, 8వ డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్‌కు కృతజ్ఞతలు...